విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొనాలంటూ... తెలుగుదేశం ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌కు... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 18న జరగనున్న ఫ్లైఓవర్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనాలని నితిన్ గడ్కరీ లేఖ రాశారు. అదే రోజు తెలుగుదేశం హయాంలో మంజూరైన జ్యోతిమహల్ నుంచి రమేశ్ ఆస్పత్రి జంక్షన్ వరకూ బెంజి సర్కిల్‌పై ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగనుంది.
విజయవాడ బైపాస్ నిర్మాణంలో భాగంగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై గొల్లపూడి 30వ కిలోమీటర్ నుంచి చినకాకాని 47.8 కిలోమీటర్ వరకూ.. రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర 6 వరుసలతో వంతెన నిర్మాణాన్ని1132 కోట్ల రూపాయల అంచనాతో కేంద్రం ఆమోదించినట్లు తెలుగుదేశం ఎంపీలు తెలిపారు.
ఇదీ చదవండి:
18న కనకదుర్గ పైవంతెన ప్రారంభం..సమాచారమిచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ