INTERVIEW : ఈ ఏడాది పటిష్ట చర్యలు.. :దుర్గగుడి ఈఈ భాస్కరరావు - vijayawada durga temple executive engineer bhaskar rao
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అభివృద్ధి పనులు... ప్రారంభమయ్యాయి. ఏడు నెలల తర్వాత ఆయా పనులకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. శివాలయ పునర్నిర్మాణం, ప్రసాదం పోటు, అన్నదాన భవనం, కేశఖండనశాల, పూజా మండపాలు, కల్యాణ మండపాల నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. గత ఏడాది దసరా ఉత్సవాల్లో కనకదుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పించిన రోజున ఇంద్రకీలాద్రిపై నుంచి భారీకొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల్లో గత అనుభవాలను, ఇటీవలి భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొండ పటిష్టత పనులు చేపట్టారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనుల తీరుతెన్నులపై ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు భాస్కరరావుతో మా ప్రతినిధి ముఖాముఖి.