వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్ చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఎవరూ ప్రైవేటు కళాశాలల్లో నేరుగా ప్రవేశాలు తీసుకోవద్దని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ సూచించారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు ప్రస్తుతం ప్రవేశాలు నిర్వహిస్తూ.. రుసుం వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ప్రవేశాలకు ఇంటర్ విద్యామండలి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలు మే, జూన్ నెలల్లో ఉంటాయన్నారు. షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేసి వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపారు.
ఇదీచదవండి