ETV Bharat / city

Indrakeeladri: ముగిసిన దుర్గమ్మ పవిత్రోత్సవాలు - vijayawada dhurgamma Pavithrotsavalu

విజయవాడ దుర్గగుడిలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల నిర్వహణతో.. లోకశాంతి కలుగుతుందని ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ తెలిపారు.

Durgamma Pavithrotsavalu
దుర్గమ్మ పవిత్రోత్సవాలు
author img

By

Published : Aug 23, 2021, 1:21 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు.. పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. శ్రావణపౌర్ణమి రోజున ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కాలవైపరీత్యాల కారణంగా వచ్చే దోషాల నుంచి విముక్తి కోసం.. సకల దోష నివారణార్ధం ఏటా ఆలయాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుండడం ఆనవాయితీ.

విశేష శక్తి కలిగిన పవిత్రోత్సవాల వల్ల లోకశాంతి కలుగుతుందని ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాదశర్మ తెలిపారు. కార్యక్రమంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, పండితులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కర్నూలు కలెక్టరేట్​ను ముట్టడించిన ఉల్లిరైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.