రాష్ట్రంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్ నీలం సాహ్ని. కరోనా నిబంధనల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. వివిధ శాఖలు తమ పథకాలతో కూడిన శకటాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా ఆహ్వానితులను పరిమితం చేయాలని సూచించారు. విజయవాడ ఎంజీ రోడ్డును అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి