కడపలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో లక్షా 60 వేల రూపాయలు విలువ చేసే 635 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వనిపెంటకు చెందిన నసీరుద్దిన్ షా అనే వ్యక్తి కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కృష్ణా జిల్లా మొవ్వలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారులు మద్యం విక్రయ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని మొవ్వ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ విధించారు.