ఓబులాపురం మైనింగ్ కేసులో ఈడీ విచారణకు గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి గాలి జనార్దన్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గనుల అక్రమాల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిపై 2007లో సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశాలకు తరలించిన నగదు లావాదేవీలపై ఈడీ వివరణ కోరింది. నోటీసులు అందుకున్న గాలి జనార్దన్ రెడ్డి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇదీ చూడండి: మధ్యాహ్న భోజన కార్మికుల 'ఛలో విజయవాడ'