విజయవాడలో కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారికి.. రాష్ట్ర ప్రభుత్వం అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తోంది. కరోనా రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు.. పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని.. నగరంలోని ప్రణీత మహిళా పోదుపు సంఘం, విజయ మేరీమాతా సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు సీతామహాలక్ష్మీ తెలిపారు. అత్యధికంగా పోషక విలువలు ఉండే కూరలు, కోడిగుడ్డు, డ్రై ఫ్రూట్స్, అరటి పండు, మామిడి పండు, రాగి జావ వంటి వాటిని మెనూతో అందిస్తున్నామన్నామన్నారు.
తయారీ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆహారాన్ని పంపిస్తున్నట్టు చెప్పారు. వారంలో రెండు రోజులు మాంసాహారం.. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, రాగి జావ, రాత్రి భోజనంలో రసం, అన్నం అందుబాటులో పెడుతున్నట్టు వివరించారు. ప్రభుత్వ కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న సుమారు 700 మందికి ఈ ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఒక్కో రోగికి రూ.500 ప్రభుత్వం వెచ్చిస్తోందని, కరోనా బాధితుల పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: