మహిళా అక్షరాస్యత కోసం నిరంతరం కృషి చేసిన సావిత్రిభాయ్ ఫూలేను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు సాగాలని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మానవ హక్కుల సంఘం సభ్యులు అండగా నిలిచి సమస్య పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. మనిషి బతకడం కోసం కాదని.. గౌరవంగా జీవించే విధంగా సభ్యులు పనిచేస్తే అ సంఘానికి మంచి గుర్తింపు వస్తుందని అన్నారు.
హక్కుల కమిషన్, రాజ్యాగంలోని చట్టాలపై అవగాహన పొందినప్పుడే.. మానవ హక్కుల సంఘం సమాజంలో నిలబడుతుందని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పోలీసుశాఖ మనవ హక్కులు కోసం నిత్యం కృషి చేస్తోందని సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషా అన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా మానవ హక్కుల గురించి ప్రజలంతా అవగాహన పొందుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: 'అది స్వేచ్ఛ కాదు బాధ్యత.. నిబద్ధతతో చదవాలి'