ETV Bharat / city

TO-LET BOARDS : విజయవాడలో భారీగా 'టులెట్' బోర్డులు - vijyawada latest news

అదొక పెద్ద నగరం..! రాజధానికి ఆనుకునే ఉంటుంది..! ఒకప్పుడు అద్దె ఇల్లు కావాలంటే నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అద్దె ఇళ్లన్నీ ఆరేడు నెలలుగా ఖాళీగానే ఉన్నాయి..! వీధికి 30, 40 'టులెట్‌' బోర్డులు దర్శనమిస్తున్నాయి.

విజయవాడలో భారీగా 'టులెట్' బోర్డులు
విజయవాడలో భారీగా 'టులెట్' బోర్డులు
author img

By

Published : Sep 10, 2021, 3:44 PM IST

విజయవాడలో భారీగా 'టులెట్' బోర్డులు

విజయవాడ నగరం రాజధాని అమరావతికి పక్కనే ఉంటుంది. కానీ నగరంలో ఎక్కడ చూసినా 'టులెట్‌' బోర్డులే కనిపిస్తున్నాయి. ఏ వీధిలో తిరిగినా గతంలో ఎన్నడూ చూడని విధంగా 30, 40 అద్దె ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. కరోనా కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన కూలీలు, చిన్నచిన్న ఉద్యోగులు కొవిడ్‌ రెండోదశ వ్యాప్తి తగ్గినా నగరానికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఉపాధి పనులు లేకపోవడం, నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోవడంతో అద్దెలు కట్టలేమని భావించి సొంతూళ్లలోనే ఉండిపోతున్నారు. దీని కారణంగా నగరవ్యాప్తంగా వందల సంఖ్యలో అద్దె ఇళ్లు నెలల తరబడి ఖాళీగా ఉంటున్నాయి.

మారిన పరిస్థితి...

బెజవాడలో ఒకప్పడు ఇల్లు కిరాయికి దొరకాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. అలా తిరిగినా అనుకున్న వసతులతో అద్దె ఇల్లు దొరకడం గగనంగానే ఉండేది. కొంతమంది అద్దె ఇల్లు కోసం మధ్యవర్తులను సైతం ఆశ్రయించేవారు. కరోనా వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కరోనా కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన చిన్న చిన్న ఉద్యోగులు, కూలీలు, పిల్లల చదువు కోసం వచ్చిన వారూ తిరిగి నగరానికి రావడం లేదు. నగరంలో ఉపాధి దొరక్కపోవడం, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో అద్దెలు కట్టలేక సొంతూళ్లలోనే ఉండిపోతున్నారని ఇంటి యజమానులు చెప్తున్నారు.

అద్దె కట్టేందుకు ఇక్కట్లు...

ఇప్పటికీ అద్దె ఇళ్లల్లో ఉంటున్న కొంతమంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పనులు లేకపోవడం, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో అద్దెలు కట్టలేకపోతున్నారు. నగరంలో బతకాలంటే నెలకు కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ఇంటి అద్దెలపైనే ఆధారపడి జీవించే వారు, ఇల్లు కట్టేందుకు అప్పు చేసిన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇదీచదవండి.

జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ల్యాప్‌టాప్‌లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.