Police Job Applications: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 17 వేల పోస్టులకు ఏకంగా 12 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 587 ఎస్సై పోస్టులకు 2 లక్షల 47 వేల 630.. 16వేల 969 కానిస్టేబుల్ పోస్టులకు 9 లక్షల 54 వేల 64 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈసారి అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,03,806.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 12,344 నమోదయ్యాయి. ప్రస్తుత నోటిఫికేషన్లలో భర్తీ కానున్న 17,516 పోస్టుల్లో కానిస్టేబుళ్లవే 16,929 కావడం.. ఈ పోస్టులు జిల్లా కేడర్‌వే కావడంతో జిల్లాలవారీగా దరఖాస్తుల సంఖ్యపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. తమ జిల్లాలోని పోస్టులు.. నమోదైన దరఖాస్తులను బట్టి పోటీ ఎలా ఉండబోతోందనే అంచనాల్లో నిమగ్నమయ్యారు.
ఇతర రాష్ట్రాల నుంచి 46,425 దరఖాస్తులు..
ఈసారి ఇతర రాష్ట్రాల నుంచీ దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్రపత్తి కొత్త ఉత్తర్వుల ప్రకారం నాన్‌లోకల్ కోటా 5 శాతం కాగా 46,425 దరఖాస్తులొచ్చాయి.
పోలీస్ యూనిట్ల వారీగా సివిల్, ఏఆర్ విభాగాల్లో భర్తీ కానున్న పోస్టులిలా..
హైదరాబాద్ - 1,918, సైబరాబాద్ - 451, రాచకొండ - 850, వరంగల్ - 666, రామగుండం - 440, నిజామాబాద్ - 640, కరీంనగర్ - 413, సిద్దిపేట - 212, ఖమ్మం - 191, ఆసిఫాబాద్ - 182, భూపాలపల్లి - 66, ములుగు - 68, ఆదిలాబాద్ - 234, జగిత్యాల - 123, నిర్మల్ - 158, కామారెడ్డి - 240, మెదక్ - 179, సిరిసిల్ల - 142, కొత్తగూడెం - 102, మహబూబాబాద్ - 170, నల్గొండ - 464, సూర్యాపేట - 320, సంగారెడ్డి - 545, వికారాబాద్ - 107, గద్వాల - 118, మహబూబ్‌నగర్ - 202, నాగర్‌కర్నూల్ - 195, నారాయణపేట - 100, వనపర్తి - 131.
ఇవీ చదవండి: