ETV Bharat / city

శంషాబాద్​ ఎయిర్ పోర్ట్​లో భారీగా విదేశీ బంగారం స్వాధీనం

author img

By

Published : Apr 22, 2021, 8:18 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర సుమారు 386 గ్రాముల బంగారం దొరికినట్లు కస్టమ్స్​ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

gold seized in shamshabad airport
భారీగా విదేశీ బంగారం స్వాధీనం

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రాగా... తనిఖీ చేశారు. నిందితుని టీషర్టు లోపలి భాగంలో పేస్టు రూపంలో బంగారాన్ని దాచి తెచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ప్రయాణికుడి వద్ద రూ.19.1 లక్షల విలువైన 386 గ్రాములు బంగారం దొరికినట్లు అధికారులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బంగారం ఎవరు తెప్పించారు...? ఎక్కడికి తరలిస్తున్నారు...? వంటి కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:

అమవరావతి అభివృద్ధి పనులు.. ఏఎమ్ఆర్​డీఏ నుంచి బదలాయింపు

వికాస్​ దుబే ఎన్‌కౌంటర్​‌లో పోలీసులకు క్లీన్‌చిట్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.