గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,398 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 9,05,946కు చేరింది. మరణాల సంఖ్య 7,234కు పెరిగింది. వైరస్ నుంచి మరో 787 మంది బాధితులు కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,89,295కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,417 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 31,260 కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
గుంటూరులో అత్యధికంగా 273 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. విశాఖలో 198, చిత్తూరులో 190, కృష్ణాలో 178, నెల్లూరులో 163, కర్నూలులో 96, కడపలో 75, శ్రీకాకుళంలో 51, ప్రకాశంలో 48, విజయనగరంలో 47, అనంతపురంలో 36, తూర్పుగోదావరిలో 28, పశ్చిమగోదావరిలో 15 కరోనా కేసులు వెలుగుచూశాయి.
జిల్లాల వారీగా మృతులు...
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా... చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు.
ఇదీచదవండి.