రాష్ట్రంలో కొత్తగా 758 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,95,879కు చేరింది. మరణాల సంఖ్య 7,201 కి పెరిగింది. వైరస్ నుంచి మరో 231 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు...
చిత్తూరులో అత్యధికంగా 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 127, విశాఖలో 98, కృష్ణాలో 80, అనంతపురంలో 56, తూర్పుగోదావరిలో 45, నెల్లూరులో 33, ప్రకాశంలో 30, శ్రీకాకుళంలో 27, కడపలో 24, విజయనగరంలో 23, పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: