రాష్ట్రంలో కరోనా రోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేసులు భారీగా పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కరోనా సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ తెదేపా నేతల బృందం కృష్ణా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
కొవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవటంతో క్యూ లైన్లలో నిల్చొని కరోనా బారిన పడ్డ వారు ఉన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ప్రభుత్వం ఇవాళ్టికి నిజాలు బయట పెట్టటం లేదు. తప్పును ఎత్తిచూపిన వారిపై విమర్శలు చేసిన వారందరూ ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు పట్టించుకోకపోవటంతో అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. వచ్చే ఆరు నెలల్లో వెయ్యి కోట్ల ఖర్చు చేయాలని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు?- దేవినేని ఉమ, మాజీ మంత్రి
ఇదీ చదవండి