ETV Bharat / city

'అమలాపురం ఘటనలో పోలీసుల తీరు.. ఫ్రెండ్లీ పోలీసింగ్​కు నిదర్శనం'

అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై హోంమంత్రి తానేటి వనిత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. నిన్నటి ఘటనలో ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్​కు నిదర్శనమని తెలిపారు.

అమలాపురం ఘటనలో పోలీసుల తీరు.. ఫ్రెండ్లీ పోలీసింగ్​కు నిదర్శనం

author img

By

Published : May 25, 2022, 3:23 PM IST

అమలాపురం ఘటనలో పోలీసుల తీరు.. ఫ్రెండ్లీ పోలీసింగ్​కు నిదర్శనం

అమలాపురం ఘటనలో ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. ఎదురదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులు నిన్న వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్​కు నిదర్శనమన్నారు. అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో ఆమె సమీక్ష నిర్వహించారు. అమలాపురం విధ్వసకాండకు సంబంధించిన పుకార్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కాకుండా అంతర్జాలాన్ని నిలిపేశామని చెప్పారు. ఆందోళనలు చెలరేగకుండా అదనపు బలగాలను పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయన్న హోంమంత్రి.. హింసకు పాల్పడిన 46 మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.

అమలాపురం రణరంగం : కోనసీమ జిల్లా అమలాపురం మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.