ETV Bharat / city

Home Minister: హత్య జరిగిన 7 నెలల తర్వాత పరామర్శ యాత్రా ?: హోంమంత్రి - సుచరిత తాజా వార్తలు

సీఎం జగన్​తో హోమంత్రి సుచరిత భేటీ
సీఎం జగన్​తో హోమంత్రి సుచరిత భేటీ
author img

By

Published : Sep 9, 2021, 5:07 PM IST

Updated : Sep 9, 2021, 7:45 PM IST

16:56 September 09

సీఎం జగన్​తో హోంమంత్రి సుచరిత భేటీ

శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికే ‌అనూష హత్య జరిగిన ఏడు నెలల తర్వాత లోకేశ్‌ పరామర్శ యాత్ర పెట్టుకున్నారని హోం మంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ యాప్‌ వల్ల ఆపదలో ఉన్న ఒకరిద్దరు మహిళలకు మేలు జరిగినా..పూర్తిస్థాయి భద్రత కల్పించే యాప్‌గా గుర్తించవచ్చన్నారు. 

దేశంలో మహిళల భద్రతకు యాప్‌ తెచ్చిన రాష్ట్రం మనదేనని సుచరిత అన్నారు. దిశ చట్టం, యాప్‌పై మహిళల్లో అవగాహన పెంచాలని వ్యాఖ్యానించారు.  గత ప్రభుత్వ హయాంలోనూ మహిళలపై ఎన్నో నేరాలు జరిగాయని గుర్తు చేశారు. అనూష హత్య జరిగిన 7 రోజుల్లోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేశామని స్పష్టం చేశారు. తెదేపా హయాంలో వారంలోనే ఎప్పుడైనా చార్జ్‌షీట్‌ దాఖలు చేశారా ? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాల విషయంలో రాజకీయాలు చేయటం బాధాకరమని అన్నారు.

"దేశంలో మహిళల భద్రతకు యాప్‌ తెచ్చిన రాష్ట్రం మనదే. దిశ చట్టం, యాప్‌పై మహిళల్లో అవగాహన పెంచాలి. అనూష హత్య జరిగిన 7 నెలలకు లోకేశ్‌ పరామర్శకు వస్తున్నారు. అనూష హత్య జరిగిన 7 రోజుల్లోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేశాం. గత ప్రభుత్వ హయాంలోనూ మహిళలపై ఎన్నో నేరాలు జరిగాయి.  తెదేపా హయాంలో వారంలోనే ఎప్పుడైనా చార్జ్‌షీట్‌ దాఖలు చేశారా ?. మహిళలపై నేరాల విషయంలో రాజకీయాలు బాధాకరం."- సుచరిత, హోంమంత్రి

అంతకు ముందు సీఎం జగన్‌తో సమావేశమైన హోంమంత్రి..లోకేశ్‌ పర్యటనను అడ్డుకోవడం సహా తాజా పరిణామాలపై చర్చించారు. హోంమంత్రితో పాటు రమ్య కుటుంబ సభ్యులు సీఎంను కలిశారు. రమ్య హత్య ఘటన వివరాలను ఆమె తల్లిదండ్రులు, సోదరి సీఎంకు వివరించారు. 

ఇదీ చదవండి

lokesh narsaraopeta tour: నారా లోకేశ్‌కు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు

Last Updated : Sep 9, 2021, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.