ETV Bharat / city

'న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్​పై పిల్​ కొట్టేయండి'

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్​కు గురయ్యాయని..,ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్​పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. కాగా ఈ పిటిషన్​లో వాస్తవం లేదని...,ఓ పతిక్ర కథనం ఆధారంగా పిటిషనర్​ నిమ్మిగ్రేస్​ పిటిషన్ దాఖలు చేశారని హోంశాఖ ముఖ్య కార్యదర్శి న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేశారు.

న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్​పై పిల్​ను కొట్టేయండి

author img

By

Published : Oct 9, 2020, 5:13 AM IST

Updated : Oct 9, 2020, 6:28 AM IST

న్యాయమూర్తుల ఫోన్లు ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందంటూ దాఖలైన పిల్‌ను కొట్టేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ గురువారం హైకోర్టులో కౌంటర్‌ వేశారు. ఆ పిల్‌ను కొట్టేయాలని కోరారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ను పర్యవేక్షించేందుకు ఇద్దరు పోలీసు అధికారుల్ని ప్రభుత్వం నియమించిందన్న పిటిషనర్‌ వాదనలో వాస్తవం లేదు. ఓ పత్రిక ప్రచురించిన నిరాధార కథనం ఆధారంగా పిటిషనర్‌ నిమ్మిగ్రేస్‌ పిల్‌ దాఖలు చేశారు. ఆ కథనం ప్రచురించినందుకు లీగల్‌ నోటీసు ఇచ్చాం. ఆ కథనాన్ని ప్రభుత్వం ఖండిస్తున్న విషయాన్ని ఏజీ.. హైకోర్టు సీజేకు ఫోన్‌ చేసి చెప్పారు’ అని కౌంటర్‌లో పేర్కొన్నారు.

  • హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

ఇదీచదవండి

న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా..? : హైకోర్టు

Last Updated : Oct 9, 2020, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.