విద్యార్థి బయటకెళ్లే ఏడాది చివరి త్రైమాసికంలో బోధనా రుసుంలను నేరుగా కాలేజీలకు ఎస్క్రో ఖాతాల ద్వారా పంపే ఆలోచన చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు(Higher Education Council Chairman Hema Chandra Reddy on tuition fee). ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని ధ్రువపత్రాలిచ్చే విషయంలో విద్యార్థులను కళాశాలలు ఇబ్బంది పెడితే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు బకాయిలతో సహా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా రూ. 4 వేల కోట్లను గతంలోనే చెల్లించినట్లు ఆయన(Hema Chandra Reddy on tuition fee) తెలిపారు.
రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే 87 శాతం మంది విద్యార్ధులకు పూర్తిస్థాయిలో ఫీజుని భరిస్తున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల్లో 35 శాతం ఉన్న రాష్ట్ర కోటాలో చదివే విద్యార్థులకు కూడా జగనన్న విద్యా దీవెన అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీజీ విద్యార్ధులకిచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టే దాన్ని ఆపేశామన్నారు.
కరోనా కష్టకాలంలోనూ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర(Special Principal Secretary Satish Chandra) తెలిపారు. బకాయిలు కూడా చెల్లించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి..
CM REVIEW: కరెంట్ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలి: సీఎం జగన్