విజయవాడ మొగల్రాజపురంలోని తెదేపా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
లోకేశ్ అరెస్టుకు నిరసనగా జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, బోండా ఉమకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటివద్ద రోడ్డుపైనే బోండా బైటాయించారు.
ఇదీ చదవండి: