పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బులిటెన్, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై.. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ వైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇదీ చదవండి: తెలంగాణ: నిమ్స్‌లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం