న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమల్లో అనుచితంగా వ్యాఖ్యానించిన కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ పూర్తి చేసేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని కోర్టుకు తెలిపారు. అప్పటివరకు విచారణకు సమయం ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్