ETV Bharat / city

పరిషత్ ఎన్నికలపై జనసేన పిటిషన్.. కౌంటర్ దాఖలుకు ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నూతన నోటిఫికేషన్​ ఇవ్వాలని జనసేన దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్​ ఆధారంగా ఎన్నికలు నిర్వహించటం సరికాదని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

high court hearing on janasena petition in ap
జనసేన పిటిషన్​పై హైకోర్టు విచారణ
author img

By

Published : Mar 17, 2021, 6:46 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్​ను కొనసాగిస్తూ ఎన్నికలు జరపటం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది.. వాదనలు వినిపించారు. పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

ఎంపీటీసీ, జట్పీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.