విజయవాడలోని బెంజ్ సర్కిల్ పై వంతెన వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం... తీర్పును వాయిదా వేసింది. స్థానిక ప్రజల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి అధ్యయనం చేకుండా... బెంజ్ సర్కిల్ సమీపంలో రెండో పైవంతెన ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటూ విజయవాడకు చెందిన వై.బసవేశ్వరరావు గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రెండో పైవంతెన ఏర్పాటు కారణంగాా సర్వీసు రోడ్డు కుదించుకుపోయి.. సమీప కాలనీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పిల్లోపాటు మరో రెండు అప్పీళ్లుపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది పిఎస్ఆర్ ఆంజనేయులు వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్హచ్ఏఐ(NHAI) వ్యవహరిస్తోందన్నారు. స్థానిక ప్రజల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్హెచ్ఏఐ(NHAI) తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి స్థలం ఇస్తే 5.3 మీటరు వెడల్పుతో సర్వీసు రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బైపాస్ రహదారి సిద్ధమైతే భవిష్యత్తులో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ల వద్ద ట్రాఫిక్ సమస్య ఉండదన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
ఇదీ చదవండి...
Transfer: ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియామకం