సినీ కథానాయకుడు సందీప్ కిషన్... తను స్వయంగా నెలకొల్పిన ఎక్స్‌ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ ప్రారంభించారు. ఇవాళ విజయవాడ పర్యటించిన సందీప్ కిషన్... నగరంలో మెుదటి బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి నగర మేయర్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. బెస్ట్ స్టైలిష్ తరహాలో హైదరాబాద్‌కు తగ్గ స్థాయిలో ఈ సెలూన్ ప్రారంభించినట్లు సందీప్ కిషన్ తెలిపారు.
కొత్త సినిమాలపై మాట్లాడుతూ.. త్వరలో మాస్‌తో పాటు కామెడీ తరహాలో గల్లీ రౌడీ సినిమా విడుదల కాబోతోందన్నారు. థియేటర్లు ప్రారంభమైతే సినిమాలు ఎక్కడైనా ఆడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. "మా" ఎన్నికల్లో... తనకు నచ్చిన వారికి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి వస్తానని సందీప్ కిషన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: