సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అతన్ని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితికి చేరుకున్న సాయి ధరమ్ తేజ్‌కు చికిత్స అందిస్తున్న వీడియోను వైద్యులు తాజాగా విడుదల చేశారు.
'చికిత్సకు సాయిధరమ్ తేజ్ స్పందిస్తున్నారు. అంతర్గత అవయవాల పనితీరు స్థిరంగా ఉంది. అంతర్గత అవవాయల్లో ఎలాంటి బ్లీడింగ్ లేదు. కాలర్‌బోన్ గాయానికి శస్త్రచికిత్స అంశాన్ని రేపు పరిశీలిస్తాం' - అపోలో వైద్యులు
ఏం జరిగిందంటే..?
సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధిలో శుక్రవారం రాత్రి సాయిధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి(cable bridge in hyderabad) వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయారు. ప్రమాదంలో ఆయన కుడి కంటి పైభాగం, ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మాదాపూర్ ఏసీపీ ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని.. దాని వల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:
సాయితేజ్ యాక్సిడెంట్.. వారిపైనా కేసు పెట్టాలన్న ఆర్పీ పట్నాయక్