మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది.
అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటలలో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: Rain Alert: అల్పపీడన ప్రభావం.. రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు!