ETV Bharat / city

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం.. ఒక్కరోజులో ఆస్తి నష్టం ఎంతంటే? - సికింద్రాబాద్ అల్లర్లు తాజా సమాచారం

Heavy Property Damage to Railways: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ ఆశావహ అభ్యర్ధులు చేసిన ఆందోళన రైల్వే శాఖకు భారీనష్టాన్ని మిగిల్చింది. ఆందోళనకారులు తొలుత ఈస్ట్‌కోస్ట్‌, అజంత, రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై దాడులు చేశారు. ఓ ఎంఎంటీఎస్‌ ఇంజిన్‌పైనా రాళ్లు విసిరారు. రెండు పార్సిల్‌ వ్యాన్లు సహా మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు రూ.7 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఏకే గుప్తా వెల్లడించారు.

Heavy property damage to railways due to agnipath protest
అగ్నిపథ్ వ్యతిరేకతతో రైల్వేకు భారీగా నష్టం
author img

By

Published : Jun 18, 2022, 9:28 AM IST

Heavy Property Damage to Railways: తెలంగాణలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌ రైల్వే స్టేషన్​లో జరిగిన హింసాత్మక ఘటనతో రైల్వే శాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఆందోళనకారులు తొలుత ఈస్ట్‌కోస్ట్‌, అజంత, రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై దాడులు చేశారు. ఓ ఎంఎంటీఎస్‌ ఇంజిన్‌పైనా రాళ్లు విసిరారు. రెండు పార్సిల్‌ వ్యాన్లు సహా మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. 77కి పైగా బోగీల అద్దాలను పగలగొట్టారు. ఎనిమిది లోకోమోటివ్‌ల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈస్ట్‌కోస్టు, రాజ్‌కోట్‌, అజంతా ఎక్స్‌ప్రెస్‌లలోని పార్సిల్‌ వ్యాన్లు తగలబడిపోయాయి. ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో హౌరాకు తరలాల్సిన చేపలకు నిప్పంటుకుంది. కోడిగుడ్ల బాక్సులు బద్దలయ్యాయి. ఫ్యాన్సీ వస్తువులు, రాఖీలు కాలిపోయాయి. మంటలనార్పి అందులోని చేపలను బయటకు తీసినప్పుడు దెబ్బతినని వాటిని స్థానికులు ఎత్తుకెళ్లారు. పార్సిల్‌ వ్యాన్లలోని దాదాపు 20 ద్విచక్రవాహనాలను కిందకు లాగి నిరసనకారులు తగలబెట్టారు. భారీఎత్తున హౌరాకు తరలుతున్న తల జుత్తు సైతం తగలబడిపోయింది. పెట్రోలు సీసాలు, కిరోసిన్‌ చల్లి నిప్పంటించినట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఆందోళనకారులు తమ దాడుల్లో సిగ్నలింగ్‌ వ్యవస్థ, రైల్వేట్రాక్‌ జోలికి వెళ్లకపోవడంతో అవి సురక్షితంగా ఉన్నాయి. దీంతో రాత్రి ఎనిమిదిన్నర గంటల తర్వాత స్టేషన్‌ నుంచి రైళ్లను పునరుద్ధరించగలిగారు. ఈ దాడుల్లో దాదాపు రూ.7 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఏకే గుప్తా వెల్లడించారు.

బద్దలైన అద్దాలు... బూడిదైన సీట్లు!

కొన్ని బోగీలు కాలిపోయాయి.. మరికొన్ని ధ్వంసమయ్యాయి. కిటికీల అద్దాలు పగిలాయి.. బెడ్‌షీట్లు, బెర్తులు నిరసనకారులు పెట్టిన అగ్నిజ్వాలల్లో మాడి మసి అయిపోయాయి. జరిగిన నష్టాన్ని ప్లాట్‌ఫారాలు, రైళ్ల వారీగా లెక్క తేల్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వివరాలిలా ఉన్నాయి.

  • ప్లాట్‌ఫాం వెలుపల ఉన్న విశాఖపట్నం-సికింద్రాబాద్‌ రైల్లో 4500 బెడ్‌రోల్స్‌ కాలిపోయాయి. మరో రెండు రైళ్లలో కొన్ని అద్దాలు పగిలాయి. మరోదాంట్లో వెలుపలి పెయింట్‌ కాలింది.
  • కాలిన బోగీలు: 5. ఇందులో మూడు లగేజ్‌వి. రెండు ప్రయాణికులవి. అందులో జనరల్‌, స్లీపర్‌ ఒక్కోటి.
  • ధ్వంసమైన ఏసీ బోగీలు: 30
  • ధ్వంసం అయిన నాన్‌ ఏసీ బోగీలు: 47
  • ఒక ఎంఎంటీఎస్‌: పూర్తిగా ధ్వంసం

జరిగిన నష్టం ఎంతెంత? (రూ.లక్షల్లో)

ప్రయాణికుల రైలు బోగీల్లో కాలిని, ధ్వంసమైన వస్తువుల వివరాలు..

  • బెడ్‌షీట్లు (4300) 9,03,000
  • పిల్లో కవర్లు (2000) 64,000
  • స్మోక్‌ గ్లాస్‌లు (109) 4,00,575
  • విండో గ్లాస్‌లు (400) 5,01,600
  • మరుగుదొడ్డి గ్లాస్‌లు (84) 93,660
  • బెర్తులు (150) 7,50,000
  • ఎస్‌ఎల్‌ఆర్‌ లగేజ్‌ 15,00,000
  • జనరల్‌ సిట్టింగ్‌ బోగీ 30,00,000
  • ఎల్‌వీపీహెచ్‌ లగేజ్‌ 30,00,000
  • స్లీపర్‌ బోగీ 1,50,00,000
  • స్పార్ట్‌ వెలుపలి భాగం 3,000
  • టవళ్లు (2060) 89,680
  • ఇతరత్రా 50,00

టికెట్‌ ఆదాయ నష్టం.. దాడుల్లో జరిగిన నష్టం కాకుండా రైళ్ల రద్దు కారణంగానూ రైల్వేశాఖకు పెద్దఎత్తున నష్టం జరిగింది. రద్దయిన రైళ్లకు సంబంధించి టికెట్ల మొత్తాన్ని తిరిగి ఇస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

వివరాలు ఇలా....

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.