విజయవాడ శివారులో 800 కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రామవరప్పాడు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా... లారీలో తరలిస్తున్న సుమారు రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సీపట్నం నుంచి కొయంబత్తూరుకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది చదవండి