ETV Bharat / city

దుర్గగుడి ఈవో నియామకాన్ని తప్పుబట్టిన హైకోర్టు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా సురేష్​బాబును నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఈవోగా సురేశ్​బాబును నియమించడాన్ని సవాల్ చేస్తూ జనసేన నేత పోతుల మహేశ్ వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు వెల్లడించింది.

ap high court
ap high court
author img

By

Published : Jan 26, 2020, 4:26 AM IST

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి(ఈవో) సురేష్​బాబు నియామకానికి గతేడాది ఆగస్టు 21న ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు తప్పుబటి రద్దు చేసింది. డిప్యూటి కమిషనర్ హోదా కలిగిన వ్యక్తిని ఈవోగా నియమించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. దుర్గగుడి ఈవో సురేష్ బాబు నియామకాన్ని సవాలు చేస్తూ జనసేన నేత పోతుల మహేష్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. మరోవైపు వ్యాజ్యంపై విచారణ జరుగుతున్న సమయంలోనే సురేశ్​కు గ్రేడ్​ను పెంచుతూ ప్రభుత్వం పదోన్నతి ఇచ్చింది.

ఇదీ చదవండి:'కార్యాలయాలను తరలిస్తే ప్రభుత్వానిదే బాధ్యత'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.