విజయవాడలో సుభోజనం పేరిట హరేకృష్ణ మూవ్‌మెంట్ అన్నదానం చేస్తోంది. కర్ఫ్యూ ఆంక్షల వల్ల ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు హరేకృష్ణ మూవ్‌మెంట్ ఉపాధ్యక్షుడు గిరిధర్ తెలిపారు. రోజుకు సుమారు మూడు వేల మందికి భోజనం సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలోనూ వేలాది మందికి భోజనం అందచేశామని గిరిధర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: