పౌర్ణమి సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల ఊరేగింపు కనదుర్గానగర్, రథం సెంటర్, వినాయకుని గుడి మీదుగా ఘాట్ రోడ్ నుంచి కొండపైకి చేరింది. సంగీత వాయిద్యాల మధ్య ఊరేగుతున్న ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించుకున్నారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున నగరోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు.
ఇదీచదవండి.