ETV Bharat / city

CJI NV RAMANA TOUR: సీజేఐ ఎన్వీ రమణకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం - cji nv ramana at Garikapadu Check Post

Grand Welcome to CJI NV RAMANA: హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం పొన్నవరానికి వస్తున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు గరికపాడు చెక్ పోస్టు వద్ద కృష్ణా జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో, మేళతాళాల నడుమ స్వాగతం పలికారు.

CJI NV RAMANA TOURT
సీజేఐ ఎన్వీ రమణ
author img

By

Published : Dec 24, 2021, 12:19 PM IST

Updated : Dec 24, 2021, 12:33 PM IST

గరికపాడు వద్ద ఘన స్వాగతం

CJI NV RAMANA AP TOUR NEWS: సీజేఐగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా స్వగ్రామం వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్​ నుంచి వస్తున్న సీజేఐ.. రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే కృష్ణా జిల్లా యంత్రాంగం మేళతాళాలతో స్వాగతం పలికింది. జిల్లా కలెక్టర్‌ నివాస్, పలువురు మహిళలు.. ఆయకు ఆహ్వానం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో, మేళతాళాల నడుమ స్వాగతం పలికారు. మహిళలు జాతీయజెండా చేతబూని.. ఎన్వీ రమణకు అభివాదం తెలిపారు.

Grand Welcome to CJI nv Ramana in Garikapadu: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రవీంద్రబాబు, రిజిస్ట్రార్‌ గిరిధర్‌, లా సెక్రటరీ సునీత, నందిగామ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్డి బి. శ్రీనివాస్‌, డీఐజీ రాజశేఖర్‌బాబు, స్త్రీ సంక్షేమ శాఖ కమిషనర్‌ కృతిక శుక్లా సహా పలువురు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు.

గరికపాడు వద్ద పటిష్ఠ బందోబస్తు..

ఈ మేరకు కృష్ణా జిల్లా యంత్రాంగం.. గరికపాడు చెక్​పోస్టు వద్ద విస్తృత ఏర్పాట్లు చేసింది. జగ్గయ్యపేట న్యాయస్థానం, న్యాయమూర్తులు న్యాయవాదులు, విద్యాశాఖ అధికారులతో పాటు, దేవాదాయ శాఖ నుంచి వేద పండితులచే ఆశీర్వచనం ఏర్పాట్లు చేశారు. గరికపాడు చీఫ్ జస్టిస్ స్వాగత ఏర్పాట్లను కలెక్టర్ నివాస్ పర్యవేక్షించారు.

పొన్నవరంలో భారీ ఏర్పాట్లు

CJI NV RAMANA: మరోవైపు సీజేఐకు ఘనంగా స్వాగతం పలికేందుకు పొన్నవరం వాసులు సిద్ధమయ్యారు. గ్రామంలో ఊరేగింపుగా ఆయన్ను తీసుకెళ్లనున్నారు. స్వగ్రామంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ నాలుగు గంటల పాటు గడపనున్నారు. గ్రామస్థుల పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే పొన్నవరం చేరుకున్నారు.

ఇదీ చదవండి..

CJI NV RAMANA TOUR: గరికపాడు వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం

Last Updated : Dec 24, 2021, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.