కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ పాటించి.. జాగ్రత్తలు తీసుకోవాలని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కోరారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో వినియోగదారులు ఇంట్లో వంటకు ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ అందిస్తున్న హిందుస్థాన్ పెట్రోలియం సంస్థను, డీలర్లను, డెలివరీ బాయ్స్‌ను కోనేరు హంపి అభినందించారు. డెలివరీ బాయ్స్ కరోనా నిరోధక పద్ధతులను పాటిస్తూ... గ్యాస్ సిలిండర్లను అందించడాన్ని ప్రశంసించారు. వినియోగదారులు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు