శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సరఫరా కోసం 1.12 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. హీరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం తాగునీటి కోసం సరఫరా చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రత దృష్ట్యా అత్యవసరంగా ఆ ప్రాంతంలో తాగునీటిని మార్పు చేస్తూ ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా ఇంజినీర్ ఇన్ చీఫ్ ను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి: దేశంలో 75 లక్షలు దాటిన కరోనా కేసులు