ETV Bharat / city

ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి: ఉత్తర్వులు జారీ - ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు న్యూస్

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

govt orders on teachers transfers
govt orders on teachers transfers
author img

By

Published : Oct 12, 2020, 9:10 PM IST

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికిగానూ ఈ బదిలీల వర్తింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఆన్ లైన్ ద్వారా బదిలీ దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం... వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ దరఖాస్తులను స్వీకరించి బదిలీలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, బదిలీలకు సంబంధించి గ్రేడ్ పాయింట్ల అంశాల షెడ్యూల్​ను విడుదల చేస్తారని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్లు, గ్రేడ్ 2 గెజిటెడ్, స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం.

డైట్ విద్యా సంస్థలతో పాటు పురపాలక, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పాఠశాలలు, సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న పాఠశాలలకు కూడా బదిలీ మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.

ఇదీ చదవండి:

అమరావతి ఉద్యమం @ 300

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.