సియాంట్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఛైర్మన్గా నలుగురు నిపుణులు, అధికారులతో ఉన్న ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్సీఎం రెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓ ఆర్జా శ్రీకాంత్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నరెడ్డి, సెంచూరియన్ డీమ్డ్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు డీఎన్ రావు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నైపుణ్య విశ్వవిద్యాలయం, కళాశాలలు సాధించాల్సిన లక్ష్యాలు, ఆయా సంస్థల్లో మౌలిక సదుపాయాలపై ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులు చేయనుంది. నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థల్లో అధ్యాపకులు, నిపుణుల నియామకాన్ని కూడా ఉన్నతస్థాయి కమిటీ పర్యవేక్షించనుంది.
ఇదీ చదవండి: 'వారికి అండగా మేముంటాం.. హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాం'