ETV Bharat / city

ఏపీ జెన్​కో బకాయి వడ్డీ, చెల్లింపుకు ప్రభుత్వ ఉత్తర్వులు..

author img

By

Published : Mar 19, 2021, 7:54 PM IST

విజయవాడలోని ఎన్టీటీపీఎస్ కోసం.. ఏపీ జెన్​కో తీసుకున్న రుణం తాలుకు.. వడ్డీ చెల్లింపునకు ప్రభత్వం 3.98 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

APGENCO
ఏపీ జెన్కో బకాయి వడ్డీ, చెల్లింపుకు ప్రభుత్వ ఉత్తర్వులు..

విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్​లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణం కోసం రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్​ తీసుకున్న రుణం తాలుకు వడ్డీని ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు 3.98 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ.. ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ జెన్​కో తీసుకున్న 450 కోట్ల రూపాయల రుణమొత్తానికి గానూ వడ్డీ చెల్లించాల్సిదిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2020 సెప్టెంబరు - అక్టోబరు నెలకు గానూ ఈ మొత్తం చెల్లింపునకు ఇంధన శాఖ నిధులు విడుదల చేసింది. గతంలో ఎన్టీటీపీఎస్​లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ నిర్మాణం కోసం 1000 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు గానూ.. ప్రభుత్వం, బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది.

ఇదీ చదవండీ.. తిరుపతి ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రికి బుద్దిచెప్పాలి: బీటీ నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.