రాష్ట్రంలో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో వారానికిపైగా సరకుల పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్కో కుటుంబానికీ 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామ్ ఆయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. నిత్యావసర వస్తువుల పంపిణీకి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా తూర్పు, పశ్చిమ గోదావరి , కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశింంచింది. ఈ వస్తువుల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి: