దేశ సరిహద్దుల్లో భారత సైన్యంపై చైనా దాడిని టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు ఆయన నివాళులర్పించారు. చౌకగా వచ్చే చైనా వస్తువులను దిగుమతి చేసుకొని ఆర్ధికంగా ఆ దేశం బలపడడానికి భారతదేశం తోడ్పాటునిచ్చిందని గోరంట్ల వ్యాఖ్యానించారు.
ఇకనైనా చౌనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు మేకిన్ ఇండియా ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగ్గ రాయితీలు కల్పించి స్వదేశీ ఉత్పత్తుల తయారీకి తగినంత తోడ్పాటునివ్వాలని సూచించారు.