లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారందరికీ ఆర్థికసాయం అందించేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1300 కోట్ల రూపాయల నిధుల్ని లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సాయంగా ఇచ్చేందుకు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని పంచాయతీరాజ్ విభాగం ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలామంది పేదల జీవితాలు ఆర్థికంగా ప్రభావితం అయ్యాయని... వారిని ఆదుకునేందుకు కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించేందుకు గానూ ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కొవిడ్-19ను బయోలాజికల్ డిజాస్టర్‌గా పేర్కొంటూ ఈ వ్యాధి తీవ్రత, పర్యవేక్షణ ఇతర కార్యక్రమాల కోసం 120 కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తు నిర్వహణా విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి: