ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీరు ప్రవహిస్తోంది. స్పిల్‌వే లోని రేడియల్ గేట్ల మార్గం గుండా నీరు దిగువకు వెళ్తోంది. స్పిల్ వే నిర్మాణం పూర్తైన అనంతరం తొలిసారిగా ఈ ప్రాజెక్టులోని రేడియల్ గేట్ల ద్వారా పైలట్ ఛానల్ కు నీటి ప్రవాహం మొదలైంది. జూన్ 11 తేదీన గోదావరి నది ప్రధాన మార్గంలో కాఫర్ డ్యామ్ నిర్మాణం కారణంగా అప్రోచ్ ఛానల్ మీదుగా నీటిని స్పిల్ వే స్లూయిజ్ గేట్ల నుంచి కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం క్రస్ట్ లెవల్ వద్ద నీటి మట్టం 25.72 మీటర్లను దాటడంతో పది రేడియల్ గేట్ల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. పైలట్ ఛానల్ ద్వారా తిరిగి ప్రధాన నదీమార్గంలోకి గోదావరి నీరు వెళ్తోంది.
ఇదీ చదవండి: