ETV Bharat / city

కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి: జీహెచ్​ఎంసీ మేయర్​

విద్యుత్​ అంతరాయం లేకుండాా తన కార్యాలయంలో జనరేటర్​ను ఏర్పాటు చేయాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​కు హైదరాబాద్ మేయర్​ విజయలక్ష్మి లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తన ఇంటి వద్ద విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్నాయని...తవ్వకాల వల్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతోందని మేయర్​ వివరించారు. నగరంలో విద్యుత్ కోతలు ఉన్నాయని తాను చెప్పలేదని స్పష్టం చేశారు.

కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి
కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి
author img

By

Published : Mar 5, 2021, 5:44 PM IST

కమిషనర్​కు  రాసిన లేఖ
కమిషనర్​కు రాసిన లేఖ

జీహెచ్ఎంసీ కార్యాలయంలో విద్యుత్ అంతరాయంపై మేయర్ విజయలక్ష్మి..కమిషనర్ లోకేశ్ కుమార్​కు లేఖ రాశారు. బంజారాహిల్స్​లోని తన క్యాంప్ కార్యాలయంలో తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని మేయర్ లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం వల్ల రోజువారి ఆఫీస్ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోందని వెల్లడించారు. తన క్యాంప్ కార్యాలయంలో వెంటనే 25కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాలని మేయర్ కమిషనర్​ను కోరారు.

విద్యుత్​ కోతలు ఉన్నాయని చెప్పలేదు: మేయర్​

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు రాసిన లేఖపై సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగుతుండటంతో మేయర్​ గద్వాల విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. తన ఇంటి వద్ద విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్నాయని... తవ్వకాల వల్ల విద్యుత్‌కు అంతరాయం కలుగుతోందని మేయర్​ వివరించారు. అందుకే తాత్కాలికంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరానని ఆమె స్పష్టత ఇచ్చారు. నగరంలో విద్యుత్ కోతలు ఉన్నాయని తాను చెప్పలేదని మేయర్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'బాబ్లీ కోసం పోరాడినట్లే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.