ETV Bharat / city

తెలంగాణ: సీల్డ్​కవర్​లో జీహెచ్​ఎంసీ మేయర్​, డిప్యూటీ మేయర్​ పేర్లు

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఎన్నిక రోజే సీల్డ్ కవర్ ద్వారా వెల్లడిస్తామని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. పార్టీ ఖరారు చేసిన వారికి ఓటేయాలని కేసీఆర్​ స్పష్టం చేశారు.

ghmc mayor and deputy mayor names on sealed cover said cm kcr
తెలంగాణ: సీల్డ్​కవర్​లో జీహెచ్​ఎంసీ మేయర్​, డిప్యూటీ మేయర్​ పేర్లు
author img

By

Published : Feb 8, 2021, 7:11 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఉపమేయర్ అభ్యర్థిని ఈనెల 11నే ప్రకటించనున్నట్లు తెరాస అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్నిక రోజున ఉదయం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులందరూ తెలంగాణ భవన్​కు రావాలని.. అక్కడి నుంచే జీహెచ్ఎంసీకి వెళ్లాలని కేసీఆర్ స్పష్టం చేశారు. సీల్డ్​కవర్​లో అభ్యర్థుల వివరాలు పంపిస్తామని, సమావేశానికి వెళ్లిన తర్వాత తెరిచి, కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు.. పార్టీ ఖరారు చేసిన వారికే ఓటేయాలని కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు.

కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జడ్పీ చైర్​పర్సన్​లతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు వారితో చర్చించారు. గ్రామీణాభివృద్ధిలో జిల్లా పరిషత్​లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందని.. అందుకోసం ప్రభుత్వపరంగా ప్రణాళికలు ఉన్నాయన్నారు.

జడ్పీ ఛైర్మన్లలకు క్వార్టర్స్​..

రానున్న బడ్జెట్​లో ఒక్కో జిల్లా పరిషత్​కు పది కోట్ల రూపాయలు కేటాయించే ఆలోచన ఉందని కేసీఆర్ తెలిపారు. జడ్పీ ఛైర్​పర్సన్ల నిధులు, విధుల కేటాయింపుపై చర్చించేందుకు త్వరలో ప్రగతిభవన్​లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో జడ్పీ ఛైర్​పర్సన్లకు క్వార్టర్స్ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇవీచూడండి:

ఉద్యోగుల రక్షణకు ఎస్ఈసీ మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.