ETV Bharat / city

బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్​ఎంసీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్ - బ్యాలెట్​ పద్ధతిలోనే జీహెచ్​ఎంసీ ఎన్నికలు వార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికలు బ్యాలెట్​ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గుర్తింపు పొందిన, నమోదైన 50 రాజకీయపక్షాల్లో 26 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయని తెలిపింది.

బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్​ఎంసీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్
బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్​ఎంసీ ఎన్నికలు:బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్​ఎంసీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్
author img

By

Published : Oct 5, 2020, 6:08 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని 13 రాజకీయ పార్టీలు కోరగా.. 3 పార్టీలు ఈవీఎంల ద్వారా నిర్వహించాలని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచాయి. మెజారిటీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు... 2020లో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్​ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించామని ఎన్నికల సంఘం తెలిపింది. జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన కార్పొరేషన్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇదీ చదవండి:

దిల్లీకి సీఎం జగన్.. రేపు అపెక్స్​ కౌన్సిల్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.