APPSC New Chairman: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల వేదాశీర్వచనం తీసుకున్నారు. ఛైర్మన్ సవాంగ్‌కు ఏపీపీఎస్సీ సభ్యులు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ సవాంగ్ సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా సీఎంతో భేటీ అయ్యారు.
అనుహ్య బదిలీ..ఛైర్మన్‌గా నియామకం
డీజీపీగా గౌతమ్ సవాంగ్‌పై అనూహ్యంగా, ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో డీజీపీగా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్ 1న రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఈనెల 15 వరకూ ఆ పోస్టులో కొనసాగారు. రెండేళ్ల 8 నెలల 15 రోజుల పాటు ఆయన డీజీపీ పదవి నిర్వహించారు. 2023 జులై నెలాఖరు వరకూ ఆయనకు సర్వీసు ఉంది. అలాంటిది ఉన్నపళంగా ఆయన్ను బదిలీ చేయటం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించటం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి
Gautam Sawang Transfer: గౌతమ్ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి