గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో వాణిజ్య మండలి సమావేశం జరిగింది. వెబినార్ ద్వారా నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ... కరోనా విపత్కర సమయం.. మే నెలలో 14 జాతీయ సర్వీసులు రాకపోకలు కొనసాగించగా.. ఆ సంఖ్య ఆగస్టు నాటికి 562కి చేరిందన్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఇప్పటివరకు 162 ప్రత్యేక విమానాల్లో 22 వేల మంది ప్రయాణికులు రాష్ట్రానికి తరలివచ్చినట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో కొత్తగా రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఎటువంటి విమాన సర్వీసులైన రాకపోకలు కొనసాగించేందుకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ప్రయాణికులకు కావలసిన సకల సదుపాయాలు విమానాశ్రయంలో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు.
ఇదీ చదవండీ...