ప్రత్యేక రైళ్లు ప్రారంభం కావటంతో విజయవాడ స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడుతోంది. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రస్తుతానికి 14 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే థర్మల్ స్కానింగ్ చేసి స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు బయలుదేరగా.. ఇంటర్‌స్టేట్ ట్రైన్‌ను రైల్వే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టికెట్ బుక్ చేసుకున్నవాళ్లకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు 90 నిమిషాల ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలని, అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని ప్రయాణానికి అనుమతించట్లేదని చెప్పారు. స్టేషన్లలో కరోనా నివారణ కోసం శానిటైజర్, ప్రత్యేక వరుసలు వంటి ఏర్పాట్లు చేశారు
ఇదీ చదవండి: