ETV Bharat / city

Cigarettes Seized: రూ.3.5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్

Cigarettes Seized: అక్రమంగా సరఫరా చేస్తున్న విదేశీ బ్రాండ్ల సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీసరపల్లి జాతీయరహదారి వద్ద రూ.3.5 కోట్ల విలువైన సిగరెట్లు ఉన్న ట్రక్​ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

విదేశీ సిగరెట్లు సీజ్
విదేశీ సిగరెట్లు సీజ్
author img

By

Published : Aug 3, 2022, 7:04 PM IST

Foreign Cigarettes Seized: అక్రమంగా సరఫరా చేస్తున్న రూ.3.5 కోట్ల విలువైన విదేశీ బ్రాండ్ల సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్​లోని పాట్నా నుంచి విజయవాడకు సిగరెట్లు రవాణా జరుగుతున్నట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కీసరపల్లి జాతీయ రహదారి వద్ద సిగరెట్ల ట్రక్​ను సీజ్ చేసినట్లు తెలిపారు. ట్రక్​లో రెండు రకాల బ్రాండ్ల సిగరెట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్యారిస్ బ్రాండ్ 264 కాటన్లు, గోల్డ్ విమల్ 136 కాటన్లు ఉన్నట్లు అధికారలు తెలిపారు. సిగరెట్​ పెట్టెలపై తయారీదారు వివరాలు, సిగరెట్లకు సంబంధించిన రశీదులు లేవని తెలిపారు. వాహన డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.