రాష్ట్రంలో తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 33,200 మందికి టీకా వేయనున్నారు. 15 రోజుల్లో తొలివిడత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి విడత టీకా వేయించుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో విడత టీకా వేస్తారు. విజయవాడ జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారి.. రాష్ట్రంలో మెుదటి టీకా తీసుకున్నారు.
సీఎం జగన్ సమక్షంలో టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు ప్రక్రియలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే పుష్పకుమారి అనే కార్మికురాలు సహా... మహిళా వైద్యురాలు, నర్సు, పారా మెడికల్ ఉద్యోగినికి ముందుగా వ్యాక్సిన్ వేశారు. కరోనా సమయంలో కష్టనష్టాలకోర్చి విధులు నిర్వర్తించిన తమకు తొలిగా టీకా వేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: